నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే

ఇది నిజంగా జరిగిన సంఘటన. కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రసేఖరసరస్వతులవారికి ముందు పీఠాధిపతులుగా ఇదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి తీవ్ర ఉపాసకులు.


వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు. వారిని మొదట భోంచేయమని చెప్పి వారు తిన్న తర్వాత ఇక వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.


వారన్నారు "స్వామీ! మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట రాక ఉండాల్సొస్తోంది. కొద్దిసేపు ఆ పాప మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లాడుతాం" అన్నారు.


అప్పుడు స్వామి వారన్నారు " అయ్యా! నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు" అన్నారు. అప్పుడు వారన్నారు "కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను మేం చూస్తున్నాం. మా నోళ్ళు మూతబడుతున్నాయి".

అప్పుడు స్వామి వారన్నారు " ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న "కామాక్షి" అమ్మవారే బాలికా రూపంలో ఆడుకొంటోంది.ఆమె ప్రభావం వలనే మీరు వాదించలేకపోతున్నారు." అన్నారు.


చూసారా! తనను ఆరాధించేవారిని అమ్మవారు ఎలా కంటికి రెప్పలా కాపాడుతుంటుందో.