నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


ఈ లీల కూడా బాల కృష్ణుడి లీలే. మరి చదవండి.

బాల కృష్ణుడిని ఎలాగైనా దొంగతనం చేయకుండా ఆపాలని ఒక గోపిక చాలా ఎత్తులో వెన్న పెట్టిన కుండలు పెట్టింది. వచ్చినా కనుగొనాలని ఆ కుండలకు గంటలు కట్టింది. తన పనులు చూసుకోసాగింది. కృష్ణుడు రానే వచ్చాడు.

అంత ఎత్తులో ఉన్న కుండలను చూసాడు. రోల్లు, గిన్నెలు బోర్లించి పైకి ఎక్కాడు. కట్టబడి ఉన్న గంటలను చూసి మోగవద్దని వాటిని ఆదేశించాడు.
అప్పుడు వెన్నను తీసుకొని మొదట స్నేహితులకు పెట్టాడు. గంటలు కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం మోగలేదు. అందరికి ఇచ్చిన తర్వాత తను కొద్దిగా తీసుకొని నోటిలో పెట్టుకున్నాడో లేదో గంటలు మ్రోగాయి.

శ్రీకృష్ణుడు వెంటనే "మోగవద్దని చెప్పాను గదా! మళ్ళీ ఎందుకు మ్రోగారు?" అని అడిగాడు. అప్పుడు ఆ గంటలు చెప్పాయి " ఏం చెప్పము స్వామీ ! తరతరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు గంటలను మ్రోగిస్తారు కదా. అందుకే నీవు నోటిలో పెట్టుకొనేప్పుడు మ్రోగాము" అన్నాయి.

శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుండి జారుకొన్నాడు.

4 comments:

durgeswara said...

అవును ప్రకృతిలో జడవస్తువులు కూడా పరమాత్మ సేవకోసం పరితపిస్తుంటాయి.

సురేష్ వర్డ్ వెరిఫికేషన్ తీసివేయకపోయావా

చింతా రామ కృష్ణా రావు. said...

ఎంతటి భాగ్య శాలివి! మహేశ్వరుడైనను గాంచ లేని యీ
వింతలు, మౌన భాషణలు, విశ్వమహోన్నత చిత్ స్వరూపు పల్
వింతలు సాంతమున్ గనగ. విష్ణు కథావళి నింత చక్కగా
భ్రాంతిని కల్గఁ జేయుచును భక్తి ప్రపత్తులఁ బల్క నేర్చితే!

suresh said...

శ్రీ లీలాశుకులు (బిల్వమంగళుడు) రచించిన శ్రీకృష్ణకర్ణామృతం నుండి తీసుకొన్నానండీ.

Anonymous said...

చాలా చక్కని లీలలను ప్రచురిస్తున్నారు.మీకు వందనములు.

రాజ