నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


ఇప్పుడు చెప్పబోయే విషయం గమనిస్తే నేటి మనుషులు ఆశ్చర్యపోక తప్పదు.

లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.

హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".

హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.

4 comments:

Ravana said...

హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో .. మనిషికి లేక రెక్కలు లేని ఏ జీవికైనా ఇది ఎలా సాధ్యం .. మంత్రం చెప్పకుండా నిజం చెప్పండి.. అష్టసిద్ధులు అనే కాన్సెప్ట్ లో గాలిలో ఎగరటం ఉందా ? ..

నాకైతే కలలో గాలిలో ఎగరటం వచ్చు...

Anonymous said...

రావణా,
హనుమంతుడు సముద్రాన్ని దాటడం గురించి మీకు నమ్మకం లేకపోతే, that's fine. ఇక్కడ విషయం, ఆయన వినయం గురంచి. రామాయణం అంతా పుక్కిటి పురాణం అనుకున్నా, హనుమంతుడి characterని చూసి, మనం కూడా వినయం అలవర్చుకోవచ్చు కదా?

చింతా రామ కృష్ణా రావు. said...

చాలా కాలం తరువార భక్తిసామ్రాజ్య ద్వారాలు మళ్ళీ మీరు తెరిచారు. చాలా సంతోషం అభినందన పూర్వక ధన్యవాదములు.

కీసర వంశము KEESARAVAMSAM said...

రావణుని నోరు బాగా మూయించారు. ధన్యవాదములు.