నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


తననే నమ్ముకొన్న , తన కోసమే బ్రతికే వారికి భగవంతుడు ఎలా సహాయం చేస్తాడో తెల్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని తెల్సుకొన్నా ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తాయి.

ఈ టపాలో భగవాన్ రమణమహర్షుల జీవితంలో ఆయనకు భగవంతుడు ఎలా దారి చూపాడో చూద్దామా!

రమణులు అరుణాచలం పోవాలని నిర్ణయించుకొన్నారు. డబ్బు సమస్యను మహర్షుల అన్నగారి రూపంలో తీర్చాడు.

తర్వాత రైలులో అరుణాచలం మార్గానికి చుట్టు మార్గంలో పోతుంటే ఒక ముస్లిం ద్వారా అసలు మార్గానికి మళ్ళించాడు. తర్వాత ఆ ముస్లిం కనిపించలేదు.

ఆహారం లేక అలమటిస్తుంటే మొదట ఒక గుడిలో పూజారి ఇవ్వకున్నా మేళం వాయించే వ్యక్తి రూపంలో తీర్చాడు. తర్వాత ఒక ఆవిడ దేవుడికి నైవేద్యానికని తయారుచేసిన ఆహారాన్ని మొదట రమణులకే పెట్టి ఇంకొంత ఆహారాన్ని ఒక మూటలో కట్టి పంపింది.

చివరికి అరుణాచలం వెళ్ళిన తర్వాత వేళకానివేళలో గుడి మూసిఉండాల్సిన వేళలో గుడి తలుపులు తెరిచిఉండి రమణులు ఒక్కరే లోనికి వెళ్ళి "అప్పా! నీ ఆజ్ఞ ప్రకారం నీ వద్దకు వచ్చేసాను"అంటూ అరుణాచలఅగ్నిశివలింగాన్ని కౌగిలించుకొని ఆనందభాష్పాలు రాల్చారు రమణులు.

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాను.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

జ్ఞాన నేత్రం తో చూడ గలిగితే ప్రతీ వ్యక్తికీ ఆ పరమాత్మ చేస్తున్న సహాయం అర్థమౌతుంది. మీరు చెప్పిన ఉదంతం చాలా చక్కగా ఉంది.నెనరులు.
http://andhraamrutham.blogspot.com