దయచేసి ఈ బాల కృష్ణుడి బాల్యక్రీడను దృశ్యముగా ఊహించుకుంటూ చదవండి.
ఒకసారి కృష్ణుడు అన్నం తినకుండా మారాం చేస్తున్నాడు. యశోద అన్నం తినమని కృష్ణుడిని బ్రతిమాలుతోంది. కానికృష్ణుడు తినడం లేదు. ఇలా కాదనుకొని అమ్మ యశోద " నీకు ఒక మంచి కథ చెప్తాను. చెప్పనా?" అంది. "ఊ! చెప్పు" అన్నాడు. అమ్మ మొదలు పెట్టింది. "ఒక ఊళ్ళో ఒక రాజు", "ఊ!" అని మళ్ళీ నోరు బిగబట్టుకొన్నాడు. " ఈ ముద్ద తిను, కథ కొనసాగిస్తాను" అంది.
యశొద: ఆ రాజుకు కొడుకులు
కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే)
యశొద : ఒక ముద్ద తిను
కృష్ణుడు : కథ చెప్పు ( మళ్ళీ మూతి బిగించుకొన్నాడు)
యశొద : వారు వేటకు వెళ్ళారు
కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే) అమ్మ కథ చెపుతూనే ఉంది, కృష్ణుడు వింటూ ఊగొడుతూనే ఉన్నాడు. కాని నోరుబిగబట్టుకొని తినకుండా ఉన్నాడు.
అమ్మకు ఆ బుంగమూతి చూసి నవ్వాపుకోలేక ముద్దులతో ముంచెత్తింది.
అలాగే మరోసారి పాలు తాగకుండా మారాం చేస్తున్నాడు. అమ్మ బ్రతిమాలితే కృష్ణుడు అమాయకంగా " అమ్మా! పాలుత్రాగితే వెంట్రుకలు పెరుగుతాయా?" అన్నాడు. పెరుగుతాయి,త్రాగు అంది అమ్మ.
త్రాగి వెంట్రుకలును ఒకసారి ముట్టుకొని "అమ్మా! నా వెంట్రుకలు పెరగలేదు. నువ్వు పెరుగుతాయని చెప్పావు" అనిమూతి ముడుచుకొని కూర్చొన్నాడు. అమ్మ అనుకొంది " పిల్లవాడు, వెంటనే వెంట్రుకలు పెరుగుతాయిఅనుకొంటున్నాడు," అనుకొని బాల కృష్ణుడి బుంగమూతి చూసి ఆనందం పట్టలేక,నవ్వు ఆపుకోలేక దగ్గరకుతీసుకొంది.
Tuesday, December 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
కథలను గొలిపెడి ప్రభువుకు
కథలు వినగ కోర్కె కలిగె. కంసాదులు దుర్
వ్యధలను గొలిపెడి సంగతి
కథలుగ యనుకొనుట తెలిసి, కథఁ జెప్పుమనెన్.
Post a Comment