నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


శ్రీ ఆదిశంకరాచార్యులు వ్రాశిన శివానందలహరి లో ఒక శ్లోకంలో ఆదిశంకరులు పరమశివుడిని ఎలా స్తోత్రం చేసారో చూస్తే భక్తుడికి,భగవంతుడికి మధ్య ఎంత చనువు ఉంటుందో అర్థం అవుతుంది.


ఆదిశంకరులు ఒక శ్లోకంలో


"శంకరా! మీ ఇంటికి నేను వస్తే ఏదో భక్తుడు వచ్చాడు కదా అంటూ తాగడానికి ఏమీ ఇవ్వకు. ఎందుకంటే నీవు తాగేది హాలాహలం కదా. సరే బట్టలు పెడదామనుకొనేవు, మీరు కట్టుకొనేదే ఏనుగు చర్మము. కనీసం ఏదైనా వాహనం ఇస్తాను అనుకొనేవు,నీవు వాడేదే ముసలి ఎద్దు.అది నన్ను కూడా ఎలా మోస్తుంది. నీవు ఏమీ ఇవ్వనవసరం లేదు. నీ పాదపద్మాలపై భక్తిని మాత్రం ప్రసాదించు.చాలు".


శ్లోకార్థం వివరణ ఇది.

చూసారా భగవంతుడితో భక్తుడు ఎంత చనువుగా మాట్లాడతాడో,ఉంటాడో.

5 comments:

మాలతి said...

zఅవునండీ మంచి పాయింటు ముందుకి తెచ్చేరు. భక్తిలో దాస్యభావం ఒక్కటే కాదు ఆత్మీయత కూడా వుంటుంది.

శివరంజని said...

నిజం చెప్పారండి . కోపం వస్తే ఎవరితో దెబ్బలాడలో తెలియక నేను కూడ దేవుడితో దెబ్బలాడుతుంటాను

Anonymous said...

బాగుంది. దయచేసి శ్లొకాన్ని కూడా పోస్టు చేయగలరు.

సురేష్ బాబు said...

మూల శ్లోకం:

అశనం గరలం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః .
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి

Truely said...

mee blog chala baagundi.. maaku marinni kottha vishayalu teliyaparachandi.