ఈ లీల కూడా బాల కృష్ణుడిదే.
శ్రీకృష్ణుడు పుట్టిన తొలినాళ్ళవి. ఒక వృద్ధగోపిక బాల కృష్ణుడిని కాళ్ళపై పడుకోబెట్టుకొని ఒళ్ళంతా నూనె పూసి, చేతులకు పసుపు పూసి తలంటి స్నానం చేయించింది. తర్వాత బాల కృష్ణుడిని పడుకోబెట్టడానికి జో కొట్టడం ప్రారంభించారు. భగవంతుడు నిద్రపోడు కదా అందుకని కృష్ణుడు నిద్రపోవడం లేదు. పిల్లాడు ఎంతకూ నిద్రపోవడం లేదని కృష్ణుడిని బోర్లాపడుకోబెట్టి గట్టిగా జో కొట్టడం ప్రారంభించారు.
"అయ్యో! మందర పర్వతాన్ని (కూర్మావతారంలో) మోసినప్పుడు కూడా ఇంత నొప్పి కలుగలేదు. వీళ్ళెందుకు నా వీపుపై ఇంతగా కొడుతున్నారు? ఓహో! భూమిపై పుట్టినప్పుడు నిద్రపోవాలి కదా! సరే నేను నిద్రపోతాను. అప్పుడు కొట్టడం ఆపుతారు" అనుకొని నిద్రపోతున్నట్లు నటించాడు. అప్పుడు జో కొట్టడం ఆపివేసారు.
చూసారా భగవంతుడు భక్తులకోసం ఎంత చేస్తాడో.
4 comments:
అవును మరి ఆయన ఎవరు ఏవిధంగా కొలిస్తే ఆవిధంగా పలికే దైవం కదా మరి.
ఆ కృష్ణుని చిత్రం నాకు చాలా ఇష్టం.
మీ బ్లాగు బాగుంది.
కన్నయ్య బాగా బజ్జున్నాడు సద్దుచేయకండి .
అద్దిర! కన్నయ తల్లికి
నిద్దుర నటియించి చూపె, నిజమా!. . . నిజమే.
ఇద్ధరఁ బుట్టుట చేతనె
నిద్దుర నటియించెనయ్య. నిరుపమ భక్తా!
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
Post a Comment