నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


దయచేసి క్రింద వ్రాశిన కృష్ణలీలను చదివేటప్పుడు మీ పిల్లాడినో,పాపనో లేక బాల కృష్ణుడినో ఊహించుకొని చదవండి.

మొదటిసారి అమ్మ యశోద బాల శ్రీకృష్ణుడికి కాలి గజ్జెలు వేసింది. కృష్ణుడు గజ్జెలు వేసుకొని పాకడం మొదలుపెట్టాడు. వెనుక ఏదో శబ్దం వచ్చింది. వెనుకకు తిరిగి చూసాడు. అమ్మ యశోద దూరంగా నిలబడి చూస్తోంది. మళ్ళీ పాకడం మొదలు పెట్టాడు. పాకుతున్నకొద్దీ శబ్దం వస్తూనే ఉంది. కృష్ణుడు బిక్కమొహం వేసుకొని వెనుకకు చూస్తే అమ్మ నవ్వుతూ దూరం నుండి చూస్తోనే ఉంది.

కృష్ణుడు అమ్మ వైపు చూస్తూ భయంతో మొహం పెట్టుకొని అమ్మ వైపు చూస్తూ ఏడుస్తున్నాడు. యశోద నవ్వుతూ పరుగెత్తుకుంటూ వచ్చి "కన్నయ్యా ! ఆ శబ్దం నీ కాలి గజ్జెలవిరా. వెనుక ఎవరూ రావడం లేదు" అంటూ వదిలింది. మాళ్ళీ పాకడం మొదలెట్టేసరికి మళ్ళీ గజ్జెల శబ్దం వచ్చింది.ఏడుస్తూ ఇంకా వేగంగా పాకుతూ అమ్మ వద్దకు రావడంతో తను వేసుకొన్న కాలిగొలుసులు ఇంకా శబ్దం రావడంతో అమ్మ వద్దకు వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని ఏడ్వసాగాడు.

ఈ చేష్టను చూసి యశోద నవ్వుతూ కృష్ణుడిని ముద్దాడుతూ "ఇంత చిన్న విషయానికే భయపడితే పెద్దయ్యాక ఎలా బ్రతుకుతావురా?" అంది.
బాగుంది కదండీ కృష్ణుడి లీల.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

తానే శబ్దము నర్థమై తనరగా, తన్వెంటనౌ శబ్దమున్
తానే గుర్తును పట్టఁ జాలడొకొ?మాతన్ భ్రాంతిలో ముంచఁగాఁ
బూనెంగృష్ణుఁడు బాల్యచైదముల సమ్మోహమ్ముఁ గల్పించి,అ
జ్ఞానాంభోధిని మున్గు తల్లి మమతన్గాంచెన్ యశోదాకృతిన్.